అప్పుల బాధతో రైతు సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

  • జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా భూపాలపల్లి మండలంలో ఘటన

భూపాలపల్లిరూరల్, వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా భూపాలపల్లి మండలం నందిగామలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీలాల వెంకటమ్మ రాజయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (29) ఐదు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్నాడు.

రెండు, మూడేండ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పు ఇచ్చిన వారు తీర్చాలని ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపానికి గురైన శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగు రోజుల కింద సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు భూపాలపల్లి పట్టణంలోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ ఆదివారం రాత్రి చనిపోయాడు.